హైదరాబాద్ : గాన కోకిల లతా మంగేష్కర్ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు.
92 ఏండ్ల తన జీవన ప్రస్థానంలో ఆమె 30కి పైగా భారతీయ, అంతర్జాతీయ భాషల్లో వేలాది పాటలు పాడారన్నారు. భాష, ప్రాంతాలు, దేశాలకు అతీతంగా తన గానామృతంతో సంగీత ప్రియులను ఒల లాడించారని పేర్కొన్నారు.
నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా సినిమా రంగంలో బహుముఖ ప్రజ్ఞా శాలిగా ఎదిగారన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ.. తమ సంతాపాన్ని తెలిపారు.