భువనేశ్వర్: మనుషులతోపాటు కొన్నిసార్లు జంతువులు కూడా దేవుళ్ల పట్ల తమ భక్తిని చాటుతున్నాయి. ఇదే కోవలో ఒక కోడి జగన్నాథ స్వామి విగ్రహం ముందు వంగి మొక్కింది. ఆ దేవుడ్ని ప్రార్థించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Hen Bows Down In Front Of Lord Jagannath Idol) ఒడిశాలోని పూరిలో కొలువైన జగన్నాథుడ్ని ఆ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ నలుమూలల నుంచి భక్తులు దర్శిస్తుంటారు. అలాంటి ఒడిశాలో ఒక వింత సంఘటన జరిగింది. ఒకచోట ఎత్తైన పీటపై జగన్నాథ స్వామి విగ్రహం ఉంది. ఒక కోడి అక్కడకు వచ్చింది. జగన్నాథ స్వామి విగ్రహం ముందు అది వంగి ప్రార్థించింది.
కాగా, జగనాథుడ్ని భక్తితో కోడి నమస్కరించిన ఈ వీడియో క్లిప్‌ను ‘జగన్నాథ్ ధామ్ పూరి ఎక్స్పర్ట్’ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో జగన్నాథుడి భక్తులను ఇది ఎంతో ఆకట్టుకున్నది. వారంతా ఆ కోడి భక్తికి ముగ్ధులయ్యారు. ‘విశ్వమంతా ఆయన ముందు తల వంచాలి. ఎందుకంటే ఆయనే విశ్వ సృష్టికర్త’ అని ఒకరు పేర్కొన్నారు. ‘ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉంటాడు. నారాయణుడు ఏ రూపంలో ఉంటాడో ఎవరికీ తెలియదు. జగన్నాథ స్వామికి జై’ అని మరొకరు తన భక్తి భావాన్ని చాటారు.
View this post on Instagram