హైదరాబాద్ : తెలంగాణలో రాగల మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిస్తాయన్నారు. గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఉత్తర పశ్చిమ జిల్లాల్లో భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని, శుక్ర, శనివారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.