Heavy Floods : కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న భారీ వరద
కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న భారీ వరద |

హైదరాబాద్ : కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి ప్రాజెక్టుల్లో చేరుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల జలాశయానికి 4.77 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో అధికారులు 47 గేట్లను ఎత్తి దిగువకు 4,73,674 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 6.657 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 6.462 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
శ్రీశైలం జలాశయానికి 5,59,057, క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో 5,34,189 క్యూసెక్కులుగా ఉన్నది. పది క్రస్ట్ గేట్లను 20 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 883.50 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 207.4103 టీఎంసీల నీరుంది. కుడి, ఎడమగట్టుల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది.
నల్లగొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 4,54,931 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కాగా.. ఔట్ ఫ్లో 35,820 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రస్తుతం సాగర్‌లో 567.20 అడుగుల నీరుంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 312.0450 టీఎంసీలకు గాను ఇప్పుడు 249.54 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం వరద ఇలాగే కొనసాగితే రెండు, మూడు రోజుల్లోనే డ్యామ్ నిండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి
Biden Nominates । అంబాసిడర్‌గా భారతీయ అమెరికన్ రషద్ హుస్సేన్
Covid Vaccine for kids । పిల్లలపై టీకా ట్రయల్స్‌కు బయోలాజికల్-ఈకి అనుమతి నిరాకరణ
పని చేసిన బ్యాంక్‌కే కన్నం.. అడ్డువచ్చినందుకు అసిస్టెంట్ మేనేజర్ హత్య!
Covid-19 । దేశంలో కొత్తగా 41,649 కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

