Health tips | పొట్టకింది కొవ్వుతో ఇబ్బందిగా ఉందా.. అయితే ఆ కొవ్వును తగ్గించే సింపుల్ టిప్స్ మీ కోసం..!
Health tips | అతిగా ఆహారం (Heavy food) తీసుకోవడం, మానసిక ఒత్తిడి (Mental stress), కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్ తినడం, హార్మోన్ల మార్పులు తదితర అనేక కారణాలవల్ల పొట్టకింద కొవ్వు పెరుగుతుంది. పొట్టచుట్టూ కొవ్వు చేరడంవల్ల అందహీనంగా కూడా కనిపిస్తుంటారు. అందుకే బెల్లీ ఫ్యాట్ (Belly fat) ను కరిగించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
Health tips : అతిగా ఆహారం (Heavy food) తీసుకోవడం, మానసిక ఒత్తిడి (Mental stress), కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్ తినడం, హార్మోన్ల మార్పులు తదితర అనేక కారణాలవల్ల పొట్టకింద కొవ్వు పెరుగుతుంది. పొట్టచుట్టూ కొవ్వు చేరడంవల్ల అందహీనంగా కూడా కనిపిస్తుంటారు. అందుకే బెల్లీ ఫ్యాట్ (Belly fat) ను కరిగించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. నచ్చిన ఫుడ్‌కు దూరంగా ఉంటారు. చెమటలు చిందేలా వ్యాయామాలు చేస్తారు. అయినా ఫ్యాట్ తగ్గక ఆవేదన చెందుతుంటారు. కానీ కొన్ని సింపుల్ టిప్స్ (Simple Tips) ను ఫాలో అయితే బెల్లీ ఫ్యాట్‌ను సులువుగా తగ్గించుకోవచ్చు.
చిట్కాలు
బెల్లీ ఫ్యాట్‌ను కరిగించుకోవాలనుకునేవారు ముందుగా అల్లంటీని డైలీ డైట్లో చేర్చుకోవాలి. అల్లం టీ తీసుకోవడంవల్ల శరీరంలో సహజంగా వేడి పుడుతుంది. ఈ వేడి అధిక కేలరీలను, కొవ్వును కరిగిస్తుంది.
అలాగే ప్రతి రోజు ఉదయం నానబెట్టిన బాదాం గింజలను ఎనిమిది నుంచి పది వరకు తీసుకోవాలి. ఎందుకంటే బాదాంలో ఉండే మెగ్నీషియం మజిల్ స్ట్రెంథ్‌ను పెంచుతుంది. తద్వారా బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గుతుంది.
ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండే బాదాం పప్పు తీసుకోవడంవల్ల ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. ఫలితంగా పొట్టకింద కొవ్వు తగ్గిపోతుంది.
ప్రతి రోజు ఉదయం లేదా రాత్రి సమయంలో ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవాలి. గ్రీన్ టీ కూడా బెల్లీ ఫ్యాట్‌ను సులువుగా కరిగిస్తుంది.
అలాగే రాత్రిపూట వరి అన్నానికి బదులుగా ఓట్స్ లేదా బ్రౌన్ రైస్ తీసుకోవాలి. తద్వారా కూడా బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్టవచ్చు. వరి అన్నంతో ఫ్యాట్ పేరుకుపోతుంది.
అదేవిధంగా రోజూ నీరు కూడా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. శరీరానికి సరిపడా నీరు అందినప్పుడే టాక్సిన్స్ తొలగిపోయి పొట్టచుట్టూ కొవ్వు కరుగుతుంది.
అవకాడో, పైనాపిల్, పుచ్చకాయ, నిమ్మ, క్యారెట్ లాంటి వాటిని డైట్లో చేర్చుకోవడం ద్వారా కూడా పొట్టకింద కొవ్వును కరిగించుకోవచ్చు.
అంతేగాక క్రమం తప్పకుండా ఓ ఇరవై నిమిషాలపాటు వ్యాయామాలు చేయడం ద్వారా కూడా బెల్లీ ఫ్యాట్‌ను కరిగించుకోవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | పొట్టకింది కొవ్వుతో ఇబ్బందిగా ఉందా.. అయితే ఆ కొవ్వును తగ్గించే సింపుల్ టిప్స్ మీ కోసం..!
Bihar MLA Anant Singh | కుమార్తె పెళ్లి సందర్భంగా గుర్రపు పోటీలు.. విజేతకు ‘థార్’ బహుకరించనున్న ఎమ్మెల్యే
Harihara Putra | అయ్యప్ప భక్తి నేపథ్యంలో వైభవ్ ‘హరిహర పుత్ర’.. ఆకట్టుకుంటున్న టీజర్!
Komatireddy Rajagopal Reddy | ఖబడ్దార్ బిడ్డా యుద్దం స్టార్ట్ అయితది.. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాస్ వార్నింగ్
Donald Trump: ట్రంప్‌ను హత్తుకున్న జిన్‌పింగ్.. చైనాకు ఎన్విడియా చిప్స్ బంద్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

