కొండాపూర్, మార్చి 4: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు దేశంలోనే ఉత్తమ సైంటిస్ట్లుగా నిలిచారు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న 75 అండర్ 50 విభాగంలో ‘షేపింగ్ టుడేస్ ఇండియా’ పబ్లికేషన్లో వర్సిటీ స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సురజిత్ ధారా, బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ నియాజ్ అహ్మద్ ఎంపికయ్యారు. వర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు దేశంలోనే ప్రతిష్ఠాత్మక గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్లో ఎంపికవడం సంతోషంగా ఉన్నదని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ బీజే రావు పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన పరిశోధనలు, పాఠ్యాంశాలను అందించటంలో హెచ్సీయూ ముందు వరుసలో ఉంటుందని వెల్లడించారు.