హైదరాబాద్ ఆట ప్రతినిధి, డిసెంబర్ 16: తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి అనుభవజ్ఞులైన సీనియర్ క్రికెటర్లు సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ అన్నారు. ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రంజీ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ 944 చేసిన హెచ్‌సీఏ జట్టు సెలెక్టర్ బి.మోహన్‌ను గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాభై ఏండ్లుగా క్రికెట్ అసోసియేషన్ స్వార్ధపరులు పాతకు పోయారని, వారెన్ని అడ్డంకులు వేసినా, ఎంత అడ్డు వచ్చినా వారిని ఎదిరించి ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్రంలో క్రికెట్ అభ్యన్నతి దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మాజీ సభ్యుడు, టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, సాగర్ క్రికెట్ క్లబ్ కార్యదర్శి చాతిరి బాబురావు సాగర్, సీనియర్ క్రికెటర్లు మహేశ్వర్ సింగ్, ప్రహ్లాద్ పాల్గొన్నారు.