Harmanpreet Kaur : భారత మహిళల క్రికెట్ జట్టు చిరకాల స్వప్నాన్ని సాకారం చేసింది హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur). పదహారేళ్ల కెరీర్లో ఎన్నో ఆటపోట్లను.. వరల్డ్ కప్ ఓటములను చవిచూసిన తను సొంతగడ్డపై మెగాట్రోఫీని అందించింది. మహిళా క్రికెట్లో సువర్ణాధ్యాయానికి నాంది పలికిన ఆమె కెప్టెన్సీని ఎంత పొగిడినా తక్కువే. చిన్నప్పటి నుంచి క్రికెట్టే లోకంగా బతుకుతున్న హర్మన్‌ప్రీత్ వరల్డ్ కప్ విక్టరీ తర్వాత విమర్శకులకు గట్టి హెచ్చరికే చేసింది. ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న ఫొస్ట్లో ఇంతకూ తను ఏం చెప్పిందో తెలుసా..?
క్రికెట్ అనగానే ‘జెంటిల్మన్ గేమ్’ అనే మాట గుర్తుకొస్తుంది. కానీ, ఈ మాటకు ఇక కాలం చెల్లిందని హర్మన్‌ప్రీత్ పరోక్షంగా చెప్పేసింది. అవును.. భారత మహిళల జట్టు దశాబ్దాల కలకు తెరదించిన ఆమె తన మనసులోని మాటను వ్యక్తం చేసింది. వరల్డ్ కప్ ట్రోఫీతో సోమవారం నిద్రలేచిన హర్మన్‌ప్రీత్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. అందులో ఆమె వరల్డ్ కప్ ట్రోఫీతో నిద్రిస్తోంది. ఆమె ధరించిన పుమా టీషర్ట్ మీద ‘క్రికెట్ అనేది జెంటిల్మన్ గేమ్’ అని రాసున్న అక్షరాలను కొట్టేసి ఉన్నాయి. వాటి కిందే ‘ఎవ్రీవన్స్ గేమ్’ అంటే.. ప్రతిఒక్కరి ఆట అని రాసుంది.
HARMANPREET KAUR PHOTOSHOOT WITH THE WORLD CUP TROPHY. pic.twitter.com/Vr30hZn9Ev
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 3, 2025
ఈ ఫోటో ద్వారా ‘క్రికెట్ అనేది పురుషుల ఆటే కాదు మహిళల ఆట కూడా. మహిళా క్రికెటర్లూ అద్భుతాలు చేయగలరు. వారు ఎవరికీ తీసిపోరు, ఇకనైనా మహిళా క్రికెటర్లను చిన్నచూపు చూడడం ఆపేయండి’ అనే సందేశాన్ని చెప్పకనే చెప్పింది భారత కెప్టెన్. ఆదివారం ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరగులు తేడాతో చిత్తుచేసిన టీమిండియా తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. నాయకురాలిగా జట్టును గొప్పగా నడింపించిన హర్మన్‌ప్రీత్.. దేశానికి మూడో వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్‌గా చరిత్రకెక్కింది. కలల కప్ సాధించిన హర్మన్‌ప్రీత్ 2011 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తరహాలో సోమవారం గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ట్రోఫీతో ఫొటోలకు పోజిచ్చింది.
That bhangra by Harmanpreet Kaur before collecting the World Cup trophy 😂 pic.twitter.com/Fupqt2zWdF
— R A T N I S H (@LoyalSachinFan) November 3, 2025
MS DHONI × HARMANPREET KAUR 🥶 pic.twitter.com/11DBHyiH1e
— Johns. (@CricCrazyJohns) November 3, 2025