చరిత్రలో చేతగాని సీఎం రేవంతే
కరువు రాగానే చేతులెత్తేసిన చేతగాని ముఖ్యమంత్రిగా రేవంత్ చరిత్రలో మిగిలిపోతారని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. అసమర్థుడికి అధికారం ఇస్తే ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా సీఎం పాలన సాగుతున్నదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరువు నివారణకు చేపట్టాల్సిన చర్యలపై రేవంత్ సర్కార్ వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
- అసమర్థుడికి అధికారం అప్పగిస్తే ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా పాలన
- ఎల్ నినో ప్రకృతి సిద్ధమైతే అదే ఏపీ రాష్ట్రంలో ఎందుకు కరువు రాలేదు?
- ముందస్తు చర్యల్లో ఘోర విఫలం
- కరువు నివారణపై శ్వేతపత్రం ఇవ్వండి
- బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్షఉపనేత హరీశ్‌రావు
ఇప్పుడు కేసీఆర్ సీఎంగా ఉండి ఉంటే.. రేవంత్‌లాగా పనికిమాలిన, చేతగాని మాటలు చెప్పేవారా? వచ్చిన నీటిని వచ్చినట్టుగా ఒడిసిపట్టి.. తెలంగాణకు కరువు రాకుండా కేసీఆర్ చూసేవారు. ముందస్తు చర్యలు తీసుకొని కరెంటు కోతలు నివారించేవారు. కరోనా సమయంలో వలస కూలీలను కూడా తెలంగాణ బిడ్డలుగా భావించి కేసీఆర్ వారిని కాపాడారు. నాడు కేసీఆర్ చర్యలను దేశమంతా కొనియాడింది.
-హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : కరువు రాగానే చేతులెత్తేసిన చేతగాని ముఖ్యమంత్రిగా రేవంత్ చరిత్రలో మిగిలిపోతారని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. అసమర్థుడికి అధికారం ఇస్తే ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా సీఎం పాలన సాగుతున్నదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరువు నివారణకు చేపట్టాల్సిన చర్యలపై రేవంత్ సర్కార్ వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలు, తాగునీటి అవసరాలు, సాగునీటి పరిస్థితి, కరువు నివారణకు కేటాయించిన నిధులను ఆ శ్వేతపత్రంలో వెల్లడించాలని కోరారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల వచ్చిన కరువేనని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదురొనే దిశగా ముందస్తు చర్యలు చేపట్టడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎల్ నినో పేరుతో ప్రజలను భయపెట్టడం, ప్రతిపక్షాలపై నిందలు వేయడం మానాలని హితవు పలికారు. రైతులకు రైతు బీమా, పంటలకు పంట బీమా పథకాలను తక్షణమే అమలు చేయాలని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాన్ని రాజకీయాలకు వాడుకోవడం కాదని, ప్రజలకు అండగా నిలువడం ప్రభుత్వ బాధ్యత అనే విషయాన్ని ఇకనైనా గుర్తించాలని ప్రభుత్వానికి హితవు పలికారు.
ప్రజలను భయపెడుతారా?
“మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే. రైతులకు, ప్రజలకు భరోసా ఇవ్వడం మానేసి భయభ్రాంతులకు గురిచేస్తావా రేవంత్‌రెడ్డీ? కరువు వస్తున్నది నేనేం చేయలేనని చేతులెత్తేసేవాడు పాలకుడా? తాగునీళ్లు కూడా ఉండవని భయపెట్టడానికేనా రేవంత్‌కు సీఎం పదవి ఉన్నది? ప్రజలను కాపాడేందుకు ఎంతకైనా సిద్ధమనేవాడే కదా నిజమైన పాలకుడు?” అని పేర్కొన్నారు. కరువు ప్రకృతి సృష్టి కావచ్చు.. కానీ కరువును ఎదురొనే ప్రణాళిక రూపొందించడం, ప్రజలకు భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత కాదా? అని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

