థర్మల్ విద్యుత్తు ఢమాల్
రాష్ట్రంలో విద్యుత్తు కొరత తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, థర్మల్ విద్యుత్తు రోజువారీ ఉత్పత్తిని 140 మిలియన్ యూనిట్లకు పెంచాలని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని జెన్కో చేరుకోలేకపోతున్నది. రోజుకు సగటున 100 మిలియన్ యూనిట్లు కూడా ఉత్పత్తి చేయలేకపోతున్నది.
- క్లిష్ట సమయంలో హఠాత్తుగా నిలిచిపోతున్న విద్యుత్తు ఉత్పత్తి
- లక్ష్యం 140 ఎంయూలు.. ఉత్పత్తి 100 ఎంయూలకే పరిమితం
- చేతులెత్తేస్తున్న జెన్కో ప్లాంట్లు.. క్రమంగా తగ్గుతున్న విద్యుత్తు లభ్యత
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యుత్తు కొరత తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, థర్మల్ విద్యుత్తు రోజువారీ ఉత్పత్తిని 140 మిలియన్ యూనిట్లకు పెంచాలని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని జెన్కో చేరుకోలేకపోతున్నది. రోజుకు సగటున 100 మిలియన్ యూనిట్లు కూడా ఉత్పత్తి చేయలేకపోతున్నది. ఈ నెల 21న ఉత్పత్తి కేవలం 88.10 మిలియన్ యూనిట్లకే పరిమితమైంది. ఈ నెలలో ఇదే అత్యల్పం. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్నది. ఇలాంటి క్లిష్ట సమయంలో థర్మల్ ప్లాంట్లు అకస్మాత్తుగా షట్‌డౌన్ అవుతున్నాయి. ఇటీవల కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్‌లోని (కేటీపీపీ) యూనిట్-1 అర్ధాంతరంగా నిలిచిపోవడంతో 500 మోగావాట్ల విద్యుత్తు అందకుండా పోయింది. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)లోని యూనిట్-4లో 800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి ఆటంకమేర్పడింది. 270 మోగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌లోని యూనిట్-3 సెప్టెంబర్ 9 నుంచి మూతపడింది.
హై‘డల్’
ప్రాజెక్టుల్లో నీటి కొరత వల్ల రాష్ట్రంలో జలవిద్యుత్తు ఉత్పత్తి కూడా క్రమంగా తగ్గుతున్నది. ఈ నెల 14న జెన్కో 9.62 మిలియన్ యూనిట్ల హైడల్ విద్యుత్తును ట్రాన్స్‌కోకు సరఫరా చేసింది. ఈ నెలలో ఇదే గరిష్ఠం. ఈ తర్వాత నుంచి సరఫరా క్రమంగా తగ్గుతున్నది. 15న కేవలం 6.96 మిలియన్ యూనిట్లకే పరిమితమైన హైడల్ విద్యుత్తు ఉత్పత్తి.. 18న ఏకంగా 2.99 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. ఈ నెలలో ఇదే అత్యల్పం. ఆ తర్వాత 20న జలవిద్యుత్తు ఉత్పత్తి 3.02 మిలియన్ యూనిట్లకు చేరింది. ప్రస్తుతం ప్రియదర్శిని జురాల (234 మెగావాట్లు), సింగూరు (15 మెగావాట్లు), పాలేరు మినీ (2 మెగావాట్లు), నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ (60 మెగావాట్లు) జలవిద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి పూర్తిగా పడకేసింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

