యువతిని కాపాడిన బాలుడిని అభినందించిన మంత్రి హరీశ్
హైదరాబాద్, జనవరి 30 : ప్రాణాలకు తెగించి చెరువులో పడిపోయిన పాతికేండ్ల యువతిని రక్షించిన 7వ తరగతి విద్యార్థి కడాల రాజును ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందిన కడాల రాజు ప్రదర్శించిన ధైర్య సాహసాలు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెతకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిన రాజు.. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ హరీశ్‌రావు ట్వీట్ చేశారు.