ఇండ్లు కూల్చితే ఊరుకోం
100 అడుగుల రహదారి కోసం హెచ్ఎండీఏ అధికారులు వేసిన మార్కింగ్‌లను బీఆర్ఎస్ నేతలు బాధితులతో కలిసి పరిశీలించారు.
- ఒక్క బిల్డర్ కోసం 1500 కుటుంబాలపైకి బుల్డోజరా?
- రియల్ ఎస్టేట్ సంస్థ ప్రయోజనం కోసం ఇంత మంది జీవితాలతో ఆటలా
- రేవంత్ సర్కార్‌పై మండిపడ్డ సెవెన్‌హిల్స్, వెస్ట్రన్ మెడోస్ కాలనీవాసులు
- కాలనీల్లో మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి పర్యటన
- 100 అడుగుల రోడ్డు అలైన్మెంట్ మార్కింగ్‌ల పరిశీలన
- బాధితులకు అండగా ఉంటామని అభయం
‘ఒక రియల్ ఎస్టేట్ సంస్థ్ధ ప్రయోజనం కోసం 1500 కుటుంబాల జీవితాలను రోడ్డున పడేస్తారా? జీవితకాల సంపాదనను ధారపోసి నిర్మించుకున్న ఇండ్లపై బుల్డోజర్లు నడిపిస్తారా? ప్రభుత్వమే అనుమతులిచ్చి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేసిన ఇండ్లను ఇప్పుడు రోడ్డు అలైన్మెంట్ పేరుతో కూల్చివేయాలనుకోవడం ఎంతవరకు సమంజసమం’టూ.. సెవెన్‌హిల్స్, వెస్ట్రన్ మెడోస్ కాలనీవాసులు ప్రశ్నించారు. శనివారం మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి ఆయా కాలనీల్లో పర్యటించారు. ఒక బిల్డర్ ప్రయోజనం కోసం వందలాది కుటుంబాల జీవితాలను బలిపెట్టే ప్రయత్నాలను బీఆర్ఎస్ అడ్డుకుంటుందన్నారు. కాలనీ వాసులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మణికొండ, అక్టోబర్ 31: 100 అడుగుల రహదారి కోసం హెచ్ఎండీఏ అధికారులు వేసిన మార్కింగ్‌లను బీఆర్ఎస్ నేతలు బాధితులతో కలిసి పరిశీలించారు. దాదాపు అరగంట పాటు కాలనీల్లో పర్యటిస్తూ రహదారి వెళ్లనున్న ప్రాంతం, దాని పరిధిలోకి వస్తున్న ఇండ్లు, ప్లాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించుకున్న ఇండ్లను హెచ్ఎండీఏ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు పొందినప్పటికీ, ఇప్పుడు అవే ఇండ్ల్లు రోడ్డు అలైన్మెంట్ పరిధిలోకి వస్తున్నాయని బాధితులు వివరించారు. అధికారిక అనుమతులు, ఓసీలు ఇచ్చిన తర్వాత ఇండ్లను కూల్చివేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అనంతరం సర్వే నంబర్ 105,103లోని భూములను కూడా నాయకులు పరిశీలించారు.
రాత్రికి రాత్రే హెచ్ఎండీఏ ప్రకటనలు వెలువరించి, ఎలాంటి చదును లేకుండా ఉన్న భూములను వేలం పాటల ద్వారా భూముల క్రయవిక్రయాలు జరిపిసదరు బిల్డరు సిస్టర్ కన్సన్ కంపెనీల పేరిట గజానికి రూ.47 వేల చొప్పున అప్పగించిన తీరుపై స్థానికులు నాయకులు దృష్టికి తీసుకువచ్చారు. ఈ భూముల వ్యవహారం, రహదారి అలైన్మెంట్ మధ్య ఉన్న సంబంధాలపై సమగ్ర విచారణ జరపాలని బాధితులు కోరారు. అక్కడ నుంచి సెవెన్‌హిల్స్ అపార్టుమెంట్ ప్రాంగణంలో బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఒక్కొక్కరు తమ ఆవేదనను నాయకులు ముందు వ్యక్తపరిచారు. ఏండ్ల తరబడి ప్రశాంతంగా జీవిస్తున్న తమ కుటుంబాల్లో నెలరోజులుగా రోడ్డు మార్కింగ్‌ల కారణంగా ఆందోళన నెలకొందని న్నీటిపర్యంతమయ్యారు.

ప్రజల ఉసురు పోసుకోవద్దు
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే అనుమానాలకు ఈ రోడ్డు అలైన్మెంట్ వ్యవహారం తావిస్తోంది. సెవెన్‌హిల్స్, వెస్ట్రన్ మెడోస్, పరిసరకాలనీల్లో సుమారు 1500 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరందరి ఇండ్లపై 100 అడుగుల రహదారి ప్రతిపాదన ప్రభావం చూపుతోంది. ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇంత మంది కుటుంబాల జీవితాలతో చెలగాటమాడటం ఎంతవరకు సమంజసం.
హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో 100 అడుగుల రహదారి అలైన్‌మెంట్‌ను ఇష్టానుసారంగా రూపొందించి, రాధా రియాల్టీ సంస్థకు అనుకూలంగా మార్గాన్ని నిర్దేశించారనే ఆరోపణలు స్థానికుల నుంచి వస్తున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎంతో కష్టపడి కొనుగోలు చేసిన ప్లాట్లు, నిర్మించుకున్న ఇండ్ల మీదుగా రహదారులు వేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. రాధా రియాల్టీ యజమానికి ముఖ్యమంత్రి సోదరుడు కొండల్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన కార్యాలయంలో తరచూ కనిపిస్తుంటారని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రికి సంబంధం లేదని చెబితే ప్రజల్లో తలెత్తుతున్న అనుమానాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రహదారి అలైన్మెంట్ విషయంలో ఎలాంటి ప్రయోజనాలు, ఒత్తిళ్లు పనిచేశాయో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే వారి ఇళ్లను కోల్పోయే పరిస్థితికి తీసుకురావడం దురదృష్టకరం. ఒక బిల్డర్ ప్రయోజనం కోసం 1500 కుటుంబాల జీవితాలను బలిపెట్టే ప్రయత్నాలను బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది. కాలనీ వాసులకు పార్టీ పూర్తి ఉండగా ఉంటుంది. అవసరమైతే ఎక్కడైనా, ఎప్పుడైనా బాధితుల తరపున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన సమాధానం చెబుతారు.
– కార్తీక్‌రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి

ఇలాంటి పరిస్థితులు జీవితంలో చూడలేదు
17 ఏండ్ల కిందట ఎంతో ఇష్టంతో నిర్మించుకున్న మా ఇంటిని రెండు వైపులా రోడ్డు పేరుతో తొలగిస్తే మా పరిస్థితి ఏమిటి. పారదర్శకత, ప్రజాభిప్రాయ సేకరణ, పునరావాస వంటి అంశాలను పక్కనపెట్టి భూ సేకరణ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్తారు. . బాధితులకు పునరావాస చట్టంలోని నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. జనరంజకంగా ఉండాల్సిన భూ సేకరణ జనకంటకంగామారకూడదు. మా సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో ఇలాంటి పరిస్థితులను చూడలేదు.
– విశ్రాంత న్యాయమూర్తి విజయమోహన్

ఓసీ ఇచ్చిన భవనంలోనూ రోడ్డా
నాకున్న ఆస్తులన్నీ విక్రయించి, భవిష్యత్తరాలకు విద్యాబుద్ధులు నేర్పించాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయలు వెచ్చించి వెస్ట్రన్ మెడోస్ కాలనీలో స్థలం కొనుగోలు చేసి భవనం నిర్మించి పాఠశాల ఏర్పాటు చేశా. 2024 జూన్‌లో నేను నిర్మించిన భవనానికి ఇదే ప్రభుత్వం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇప్పుడు అదే భవనంలో సుమారు 30 శాతం భాగం రహదారి అలైన్‌మెంట్‌లోకి వస్తోంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని నిర్మించిన భవనం పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. మా పాఠశాలకు సంబంధించిన భవనాన్ని కోల్పోతే విద్యార్థులు భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమవుతుంది.
– ప్రసన్నీతారావు(వెస్ట్రన్ మెడోస్ కాలనీ బాధితురాలు)
ఓట్లు వేయించి గెలిపిస్తే పట్టించుకోవడం లేదు
గతంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ గెలుపుకోసం సెవెన్‌హిల్స్ నివాసితులతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశాం. ఇప్పుడు మా ఇండ్లపై రోడ్డు మార్కింగ్‌లు పడుతున్నా, ఇండ్లు కోల్పోయే ప రిస్థితి ఏర్పడుతున్నా ఆయన పట్టి ంచుకోవడం లేదు. మాకు అండ గా నిలిచేందుకు వచ్చిన బీఆర్ఎస్ కి జీవితాంతం అండగా ఉంటాం.
– అనిల్‌కుమార్ (సెవెన్‌హిల్స్ బాధితుడు)
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

