రెండు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ముంబైలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేసింది. తాజాగా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ శనివారం మధ్యాహ్నం టీమ్ హోటల్‌కు చేరుకున్నాడు. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం భజ్జీ ఏడురోజుల పాటు క్వారంటైన్లో ఉంటాడు. వెటరన్ ఆఫ్ స్పిన్నర్‌ను ఈ ఏడాది వేలంలో రూ.2కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది.
ఇప్పటికే క్వారంటైన్ పూర్తి చేసుకున్న ఆటగాళ్ళు తమ శిక్షణను డివై పాటిల్ స్టేడియంలో ప్రారంభించారు. ఇప్పటి వరకు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన టర్బోనేటర్ తొలిసారి పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ జెర్సీలో కనిపించనున్నాడు.
“See you in 7 Days” ⏳
— KolkataKnightRiders (@KKRiders) March 27, 2021
Our latest member of the #QuarantinedKnights group! 🤩@harbhajan_singh 🤜🤛 #KKR #HaiTaiyaar #IPL2021 pic.twitter.com/byRhETm8cq