
అహ్మదాబాద్: కరోనా మహమ్మారి చేసిన విలయతాండవం మన జీవితాల్లో వ్యక్తిగతంగా, మానసికంగా, ప్రొఫెషనల్‌గా అనేక మార్పులు తెచ్చింది. ఇది ప్రముఖ మేనేజ్మెంట్, టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లు తమ సిలబస్‌లో మార్పులు చేసేందుకు కూడా కారణమైంది. ఐఐఎం-అహ్మదాబాద్… ఆనందం (హ్యాపీనెస్), భావోద్వేగ స్థిరత్వం (ఎమోషనల్ స్టెబిలిటీ), ఆరోగ్య ఆర్థికశాస్త్రం (హెల్త్ ఎకనామిక్స్)తో పాటు పలు ఇతర అంశాలను ఎంపిక (ఎలెక్టివ్) సబ్జెక్టులుగా ప్రారంభించింది. ‘ఎలా నేర్చుకోవాలి’ అని బోధించే కోర్సును ఐఐటీ-గాంధీనగర్ తీసుకొచ్చింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల పరిశోధనకు అహ్మదాబాద్‌లోని బిజినెస్ స్కూల్ ఎంఐసీఏలో మూడు కోర్సులు తెచ్చింది.