హైదరాబాద్, ఏప్రిల్ 4: హాప్పీ మొబైల్ తన నాలుగో వార్షికోత్సవం సందర్భంగా పలు ఆఫర్లను ప్రకటించింది. కార్యకలాపాలు ప్రారంభించి నాలుగేండ్లు అయిన సందర్భంగా 4444 బహుమతులు అందిస్తున్నట్లు కంపెనీ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. ప్రతి కొనుగోలుపై 4 ఆఫర్లు(క్యాష్ బ్యాక్+ఖచ్చితమైన బహుమతి+స్క్రాచ్ కార్డ్+క్యాష్ పాయింట్స్) అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎల్ఈడీ స్మార్ట్ టీవీ, ల్యాప్టాప్, మొబైళ్ళపై తిరుగులేని ఆఫర్ ఇస్తున్నది. స్క్రాచ్ కార్డు ద్వారా 4444 బహుమతులు గెలుచుకునే అవకాశం ఉన్నదని తెలిపారు. ఈ ఆఫర్లు ఈ నెల 28 వరకు అమల్లో ఉండనున్నాయి.