హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : తిరుమలలోని మొదటి ఘాట్ రోడ్డు 7వ మైలు వద్ద ఆంజనేయుడి విగ్రహం చోరీకి గురైంది. నిత్యపూజలు అందుకునే స్వామి విగ్రహాన్ని ఓ దుండగుడు అపహరించాడు.
కాషాయ దుస్తుల్లో వచ్చి విగ్రహాన్ని ఎత్తుకెళుతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో చోరీ జరుగడంపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.