సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పుడూ ఏదో స్టిల్‌ను పోస్ట్ చేస్తుంటుంది ఆరడుగుల అందం హంసానందిని. పొడవాటి చెట్లు, చుట్టూ రాళ్లు, రాళ్ల మధ్యలోనుంచి జలపాతంలా పారుతున్న నీళ్లు..ఇలా ప్రకృతి సౌందర్యమంతా కెమెరాలో బంధించబడితే..ఆ ఫ్రేమ్‌లో హంసానందిని లాంటి బ్యూటీ ఉంటే ఎలా ఉంటుంది. ఇపుడలాంటి స్టిల్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
పొట్టి తెలుపు రంగు డ్రెస్‌లో పొడవాటి కురులతో ముగ్దమనోహరంగా ఉన్న హంసానందిని చేతులు చాచి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్న స్టిల్స్ ఇపుడు కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. ఓ వైపు ప్రకృతి సోయగం, మరోవైపు పడచు అందం కలగలపిన సీనరీ అందరినీ కట్టిపడేస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.