సౌదీ విమానాశ్రయం, ఎయిర్‌బేస్‌పై హైతీ డ్రోన్ దాడి
యెమెన్‌కు చెందిన హైతీ తిరుగుబాటుదారులు మరోసారి సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకున్నారు

సనా: యెమెన్‌కు చెందిన హైతీ తిరుగుబాటుదారులు మరోసారి సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకున్నారు. హైతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాకు చెందిన జిజైన్ ఎయిర్ పోర్ట్, కింగ్ ఖలీద్ ఎయిర్ బేస్‌లపై డ్రోన్లతో దాడి చేశారు. దీంతో రెండు ప్రదేశాల్లో తీవ్ర నష్టం వాటిల్లంది. హైతీ తిరుగుబాటుదారుల డ్రోన్లను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసిన సంఘటనకు సంబంధించి సౌదీ టీవీ అలరాబియా పేర్కొన్నది.
హైతీ తిరుగుబాటుదారులు తూర్పున డ్రోన్లు, క్షిపణి దాడులు చేయడానికి కూడా ప్రయత్నించారని సౌదీ అరేబియా పేర్కొన్నది. సౌదీ అరేబియాకు నైరుతి దిశలో ఉన్న రెండు నగరాలైన జిజైన్, ఖామిస్ మిషాయత్లను హైతీ తిరుగుబాటుదారులు లక్ష్యంగా చేసుకున్నారు.
ఈ రెండు నగరాలు నిరంతరం డ్రోన్, క్షిపణి దాడులను ఎదుర్కొంటున్నాయి. 2014 నుంచి యెమెన్‌లో అంతర్యుద్ధం కొనసాగుతున్నది. సౌదీ అరేబియా కూడా 2015 నుంచి ఈ యుద్ధంలో పాల్గొంటున్నది. అక్కడి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నది. అందుకే సౌదీ అరేబియా సరిహద్దు ప్రాంతాలను హైతీ తిరుగుబాటుదారులు లక్ష్యంగా చేసుకున్నారు.
దాడులు చేశామన్న హైతీ మిలీషియా
సౌదీ అరేబియాలోని జిజాన్ విమానాశ్రయం. కింగ్ ఖలీద్ ఎయిర్‌బేస్ వైపు బాంబులతో నిండిన డ్రోన్ దాడులను చేసినట్లు యెమెన్‌కు చెందిన హైతీ మిలీషియా ప్రకటించింది. “ఈ దాడులు జిజాన్ విమానాశ్రయంలో, ఖమిస్ ముషైట్ నగరంలోని కింగ్ ఖలీద్ ఎయిర్ బేస్ లను లక్ష్యంగా చేసుకున్నాయి” అని హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సరియా గ్రూప్ యొక్క అల్-మాసిరా టీవీ ప్రసారం చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
హైతీలు ఇటీవల సౌదీ నగరాలు, చమురు సౌకర్యాలపై సరిహద్దు క్షిపణి, డ్రోన్ దాడులను వేగవంతం చేశారు. ఇరాన్ మద్దతుగల హైతీలు అనేక ఉత్తర యెమెన్ ప్రావిన్సులను స్వాధీనం చేసుకున్నారు. 2014 చివరి నుంచి యెమెన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్నది. హదీ ప్రభుత్వానికి మద్దతుగా 2015 మార్చిలో యెమెన్ వివాదంలో సౌదీ నేతృత్వంలోని అరబ్ సంకీర్ణం జోక్యం చేసుకోవడమే ఈ దాడులకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
జూన్ నుంచి నిలిచిపోనున్న గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్ సేవలు
ప్రభుత్వ చర్యలపై సంతృప్తిగా లేం : గుజరాత్ హైకోర్టు
ఏ మత గ్రంథంలోనూ జోక్యం చేసుకోం : సుప్రీంకోర్టు
సెనేట్‌లో మెజార్టీ సాధిద్దాం : డొనాల్డ్ ట్రంప్
తొలిసారిగా అంతరిక్షంలో కాలిడిన యూరి గగారిన్.. చరిత్రలో ఈరోజు
మూడు రాష్ట్రాల్లో కొవిడ్ చర్యల్లో లోపాలు : గుర్తించిన కేంద్ర బృందాలు
అమెరికాలో కరోనా మహమ్మారి నాలుగో వేవ్..?!
అక్రమ ఆయుధ మార్కెట్: గన్ కావాలా పెషావర్ రండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

