e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై సంతృప్తిగా లేం : గుజ‌రాత్ హైకోర్టు

ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై సంతృప్తిగా లేం : గుజ‌రాత్ హైకోర్టు

ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై సంతృప్తిగా లేం : గుజ‌రాత్ హైకోర్టు

అహ్మదాబాద్ : రాష్ట్రంలో కరోనా సంక్రమణపై దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన గుజ‌రాత్ హైకోర్టు‌ ప్రధాన న్యాయమూర్తి విక్రమ్ నాథ్ కొవిడ్ నియంత్ర‌ణ‌లో ప్ర‌భుత్వ చ‌ర్చ‌ల‌పై సంతృప్తిగా లేం అని చెప్పారు. ప్రభుత్వ విధానాల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో దర్యాప్తు చేయడానికి ఏప్రిల్ 15 గురువారం సమావేశ‌మై చర్చించాల‌ని కోర్టు సూచించింది.

కరోనా మహమ్మారి గురించి ప్ర‌స్తావించిన‌ హైకోర్టు.. సామాన్యులకు కరోనా సంక్రమణ పరీక్ష రిపోర్టులు రావడానికి 4-5 రోజులు పడుతుండ‌గా, ఆర్టీ-పీసీఆర్ పరీక్ష ద్వారా అధికారులు కొద్ది గంటల్లోనే రిపోర్టుల‌ను పొందుతున్నారు. అంటువ్యాధి వ్యాప్తి దృష్ట్యా నమూనా సేకరణ, పరీక్షలు మరింత వేగంగా ఉండాలి. అంటువ్యాధి చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నందున చ‌ర్య‌లు వేగవంతంగా ఉండాలి అని హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ అన్నారు.

కరోనావైరస్ ఇన్‌ఫెక్ష‌న్‌కు చికిత్స చేయడానికి ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు ఎందుకు విక్రయిస్తున్నారని కూడా ప్రధాన న్యాయమూర్తి ప్ర‌శ్నించారు. రోగులకు తగినంత పడకలు, ఆక్సిజన్ ఉన్నాయని ప్ర‌భుత్వం చెప్తునప్పుడు ప్రజలు ఎందుకు క్యూల‌లో నిల‌బ‌డాల్సి వ‌స్తున్న‌ద‌ని ప్ర‌శ్నించారు.

ప్రతిదీ అదుపులో ఉన్న‌ద‌ని, ప్రభుత్వం తన పనిని తాను స‌క్ర‌మంగానే చేస్తున్న‌ద‌ని హైకోర్టు అడ్వకేట్ జనరల్ కమల్ త్రివేది కోర్టుకు తెలిపారు. క‌రోనా మ‌రింత వ్యాప్తి చెందుతున్నందున‌ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. లాక్‌డౌన్ ఒక్క‌టే పరిష్కారం కాదన్నారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిని సుమోటు కాగ్నిజెన్స్ గా తీసుకొని గుజరాత్ హైకోర్టు ఆదివారం పిఎల్ దాఖలు చేయాలని ఆదేశించింది. అంటువ్యాధిపై మీడియా నివేదికలు రాష్ట్రం ఒక రకమైన ఆరోగ్య అత్యవసర దిశగా పయనిస్తున్నాయని కోర్టు పేర్కొన్న‌ది.

చీఫ్ జస్టిస్ విక్రమ్ నాథ్ మౌఖికంగా ఈ సూచనలు చేశారు. కరోనా వైరస్ పరిస్థితిపై రాష్ట్ర హైకోర్టు ఇటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారించ‌డం ఇది రెండవది. మొదటి పిటిషన్ గత ఏడాది దాఖలైంది. ఇప్పటికీ నిర్ణీత వ్యవధిలో విచారిస్తున్నారు.

సోమవారం, ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పిల్‌ను విచారించనున్న‌ది. పరీక్షా సదుపాయాలు, పడకలు, ఐసీయూల కొరత మాత్రమే కాకుండా ఆక్సిజన్ సరఫరా, రెమ్‌డెసివిర్ వంటి ప్రాథమిక ఔషధాల కొరత కూడా రాష్ట్రానికి ఉందని చీఫ్ జస్టిస్ మీడియా నివేదికలను ఉటంకిస్తూ చెప్పారు.

ఇవి కూడా చదవండి..

ఏ మ‌త గ్రంథంలోనూ జోక్యం చేసుకోం : సుప్రీంకోర్టు

సెనేట్‌లో మెజార్టీ సాధిద్దాం : డొనాల్డ్ ట్రంప్

తొలిసారిగా అంత‌రిక్షంలో కాలిడిన యూరి గ‌గారిన్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

మూడు రాష్ట్రాల్లో కొవిడ్ చ‌ర్య‌ల్లో లోపాలు : గుర్తించిన కేంద్ర బృందాలు

స్మ‌గ్ల‌ర్ల కాల్పుల్లో ఇద్ద‌రు పోలీసులు మృతి

ఎంసీడీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు షాక్

ధైర్యం, థ్రిల్, పోటీ స్ఫూర్తి ఉన్న పురుషులే మంచి తండ్రులు

అమెరికాలో కరోనా మ‌హ‌మ్మారి నాలుగో వేవ్..?!

అక్రమ ఆయుధ మార్కెట్: గ‌న్ కావాలా పెషావ‌ర్ రండి..!

వివాదాల్లో జో బైడెన్ కుమారుడు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై సంతృప్తిగా లేం : గుజ‌రాత్ హైకోర్టు

ట్రెండింగ్‌

Advertisement