Haiti earthquake: హైతీ భూకంపం.. 1,419కి పెరిగిన మృతులు
Haiti earthquake: హైతీ భూకంపం.. 1,419కి పెరిగిన మృతులు |

పోర్ట్-ఓ-ప్రిన్స్ : కరేబియన్ ద్వీప దేశం హైతీలో భూకంపం తీరని విషాదాన్ని నింపింది. భారీ ప్రకంపనల ధాటికి చాలా భవనాలు కుప్పకూలడంతో ఇప్పటి వరకు 1,419 మంది వరకు చనిపోయారు. ఆరువేల మందికిపైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. శనివారం తెల్లవారు జామున 7.2 తీవ్రతతో ప్రకంపనలు రాగా.. సెయింట్ లూయిస్ డ్యూ సూడ్ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భారీ భూకంపం ధాటికి నైరుతి హైతీలో ఆసుపత్రితో పాటు పెద్ద ఎత్తున ఇండ్లు, వాణిజ్య భవనాలు నేలమట్టమయ్యాయి.
శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే గాయాలకు గురైన వారితో ఆసుప్రతులు నిండిపోయారు. ఇండ్లు నేలమట్టమవడంతో జనం డాబాలు, కారిడార్లు, పలువురి ఇంటి వరండాల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. మరికొందరు విమానాశ్రయం టార్మాక్‌లో ఆశ్రయం పొందుతున్నారు. పశ్చిమ అర్ధగోళంలో అత్యంత పేద దేశాల్లో హైతీ ఒకటి. ఇప్పటికే కరోనా మహమ్మారి, హింస, పేదరికం, రాజకీయ అశ్చితితో హైతీ అల్లాడుతోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

