GT vs CSK : లీగ్ దశ చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాపార్డర్ బ్యాటర్లు చితక్కొట్టారు. ఓపెనర్ సాయి సుదర్శన్(84) అర్ద శతకంతో కదం తొక్కగా శుభ్‌మన్ గిల్(64) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. చెన్సై బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న ద్వయం శతక భాగస్వామ్యంతో జట్టను భారీస్కోర్‌కు పునాది వేసింది. ఆఖర్లో బట్లర్(57 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో సీఎస్కే ముందు కఠినమైన లక్ష్యాన్ని నిలిపింది గుజరాత్.
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు తేలిపోయారు. అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(64), సాయి సుదర్శన్(84)ల దూకుడుకు అడ్డుకట్ట వేయలేక భారీగా పరుగులు సమర్పించుకున్నారు. పవర్ ప్లేలోనే బౌండరీల మోతతో 62 రన్స్ పిండుకున్న ఈ ద్వయం గుజరాత్‌కు శుభారంభమిచ్చింది. అనంతరం సిక్సర్‌తో 23 బంతుల్లోనే ఐదో అర్ధ శతకం సాధించిన గిల్‌ను స్పెన్సర్(1-47) ఔట్ చేసిన తొలి వికెట్ అందించాడు.
An act in symphony 🎶
Shubman Gill 🤝 Sai Sudharsan
Updates ▶️ https://t.co/p5TP9NLREX #TATAIPL | #KhelBindaas | #GTvCSK pic.twitter.com/Q6b12N9QTl
— IndianPremierLeague (@IPL) May 21, 2026
గిల్ ఔటైనా స్కోర్ వేగం తగ్గకుండా బట్లర్(57 నాటౌట్) అండతో సుదర్శన్ దంచేశాడు. సీఎస్కే బౌలర్లను హడలెత్తిస్తూ రెండో వికెట్‌కు అర్ధ శతక భాగస్వామ్యంతో జట్టు స్కోర్ రెండొందలు దాటించాడు. సెంచరీకి చేరువైన అతడిని అన్షుల్ కంబోజ్(1-56) బౌల్డ్ చేయగా.. తర్వాతి బంతికే తెవాటియా(0) రనౌటయ్యాడు. వరసగా రెండు ఫోర్లతో బట్లర్ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. సుందర్(7) చివరి బంతికి ఔట్ కావడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లోల 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.
Arrive. Launch. Repeat! ☄️
Jos Buttler is in mood tonight 🔥
Updates ▶️ https://t.co/p5TP9NLREX #TATAIPL | #KhelBindaas | #GTvCSK pic.twitter.com/dAXVYRUTf5
— IndianPremierLeague (@IPL) May 21, 2026