విరాజ్ రెడ్డి, మిమీ లియానార్డ్, శిల్పా బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గార్డ్’. ‘రివేంజ్ ఫర్ లవ్’ ఉపశీర్షిక. జగ పెద్ది దర్శకుడు. అనసూయ రెడ్డి నిర్మాత. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో విరాజ్ రెడ్డి చీలం చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఈ సినిమా చిత్రీకరణను మొత్తం ఆస్ట్రేలియాలో జరిపాం. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీ ఇది. కథానుగుణంగా చక్కటి పాటలు కుదిరాయి’ అన్నారు. ఈ ప్రేమకథా చిత్రంలో కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు ప్రణయ్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మార్క్ కెన్సీల్డ్, నేపథ్య సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని, దర్శకుడు: జగ పెద్ది.