రాజస్థాన్ రాయల్స్ మరో వికెట్ కోల్పోయింది. ఆరంభంలో నిదానంగా ఆడి, గేరు మార్చిన దేవదత్ పడిక్కల్ (28) పెవిలియన్ చేరాడు. గుజరాత్ సారధి పాండ్యా వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పడిక్కల్ విఫలమయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను కూల్చింది. దాంతో అంతకు ముందు ఓవర్లోనే గేరు మార్చి సిక్స్, ఫోర్, ఫోర్ కొట్టిన పడిక్కల్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు. 116 పరుగుల వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది.