రాయ్‌పూర్: రాయ్‌పూర్ విమానాశ్రయంలో ఓ వ్యక్తిని కొంత మంది మహిళలు చితక్కొట్టారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మానా పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేశారు. ఓ దశలో ఆ వ్యక్తి చొక్కాను చింపేసి, బెల్ట్‌తో ఆ వ్యక్తిని మహిళలు చితకబాదారు. రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన జరిగింది. ఆ వ్యక్తిని ఆటో ట్యాక్సీ డ్రైవర్ దినేశ్‌గా గుర్తించారు. రాహుల్ ట్రావెల్స్ కంపెనీలో అతను పనిచేస్తున్నాడు. కొన్ని నెలల నుంచి జీతం ఇవ్వడంలేదని దినేశ్ ఆరోపించాడు. అయితే జీతం కోసం కంపెనీకి వచ్చిన సమయంలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. మేనేజర్ నెంబర్ కోసం అడిగినప్పుడు అక్కడున్న మహిళలు తిడుతూ దాడి చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు.
Raipur- The young man was beaten with a belt by the women at Swami Vivekananda Airport, Raipur.#Raipur #Airport #chhattisgarh #ViralVideo pic.twitter.com/BiGQM3k5EC
— Chaudhary Parvez (@ChaudharyParvez) September 19, 2022