IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ల్(IPL 2023) ఎలిమినేటర్(Eliminator match) మ్యాచ్లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర చేసింది. 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు కొట్టింది. గత మ్యాచ్ సెంచరీ హీరో కామెరూన్ గ్రీన్(41), సూర్యకుమార్ యాదవ్(33) రాణించారు. నవీన్ ఉల్ హక్ ఒకే ఓవర్లో వీళ్లిద్దరిని ఔట్ చేసి ముంబైని దెబ్బకొట్టాడు. ఆఖర్లో తిలక్ వర్మ(26), ఇంపాక్ట్ ప్లేయర్ నేహల్ వధేరా(23) టిమ్ డేవిడ్(7) దంచడంతో ముంబై పోరాడగలిగే రన్స్ కొట్టింది.
యశ్ ఠాకూర్ వేసిన 20వ ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్ నేహల్ వధేరా(23) తొలి బంతికి ఫోర్ కొట్టాడు. మూడో బంతికి 91 మీటర్ల సిక్స్ బాదాడు. నాలుగో బంతికి బౌండరీ సాధించాడు. ఆఖరి బంతికి రవి బిష్ణోయ్ చేతికి చిక్కడు. దాంతో ముంబై 8 వికెట్లు కోల్పోయి 182పరుగులు చేసింది.
Flair 🤝 Power
Two sensational shots at two completely different parts of the ground ft. SKY & Green 💥💥#TATAIPL | #Eliminator | #LSGvMI pic.twitter.com/qN1tZwdiZ5
— IndianPremierLeague (@IPL) May 24, 2023
కీలక మ్యాచ్లో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ(11), ఇషాన్ కిషన్(15) 38 రన్స్కే పెవిలియన్ చేరారు. కష్టాల్లో పడిన ముంబైని కామెరూన్ గ్రీన్(41), సూర్యకుమార్ యాదవ్(33) ఆదుకున్నారు. ఒకే ఓవర్లో నవీన్ ఉల్ హక్ వీళ్లిద్దరిని ఔట్ చేసి ముంబైని దెబ్బకొట్టాడు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 4, యశ్ ఠాకూర్ 3 వికెట్లు తీశారు. మొహ్సిన్ ఖాన్కు ఒక వికెట్ దక్కింది.