మహబూబాబాద్ : ఖమ్మం – వరంగల్ జాతీయ రహదారిపై గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. తొర్రూరు మండలం నాంచారి మడూరు వద్ద ఓ లారీ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లక్ష్మి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రురాలిని హాస్పిటల్కు తరలించారు. కాగా, కరీంనగర్ నుండి కాకినాడ పోర్ట్ కు వెళ్తుండగా ప్రమాదంజరిగింది. ఇదే రూట్లో వరుసగా గ్రానైట్ లారీల ప్రమాదాలతో స్థానిక ప్రజలు హడలెత్తి పోతున్నారు. అధికారులు స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.