యాదాద్రి భువనగిరి : భువనగిరిలో( Bhuvanagiri) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు(KTR) ఘన స్వాగతం లభించింది. జయశంకర్ భూపాపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగమైన కన్నెపల్లి పంపు హౌన్ను సందర్శించేందుకు హైదరాబా నుంచి బయలు దేరారు. ఈ క్రమంలో భువనగిరి వివేరా హోటల్ వద్ద ఆగారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చిన పూల మాలలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బూడిద బిక్షమయ్యగౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ఉన్నారు.