666 Operation Dream Theatre | కన్నడ స్టార్ హీరో, కరుణాద చక్రవర్తి డాక్టర్ శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త చిత్రం ‘666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. ‘సప్త సాగరాలు దాటి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన లవ్ స్టోరీని అందించిన ప్రముఖ దర్శకుడు హేమంత్ ఎం. రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ తెలుగు టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
ఈ చిత్రం 1970ల నాటి రెట్రో నేపథ్యంలో సాగే ఒక స్టైలిష్ స్పై యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. కన్నడ దిగ్గజ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ నటించిన క్లాసిక్ ‘సీఐడీ 999’ చిత్రాల సిరీస్‌కు నివాళిగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విడుదలైన టీజర్లో శివరాజ్‌కుమార్ ‘ఏజెంట్ ప్రకాష్’ అనే సీనియర్ స్పై పాత్రలో వింటేజ్ లుక్‌తో అదరగొట్టారు. మరో వైపు టాలెంటెడ్ యాక్టర్ డాలి ధనంజయ్ ఇందులో మరో కీలకమైన ఏజెంట్ శంకర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన టైమ్ ట్రావెల్ లేదా ఒక విభిన్నమైన మిషన్ ఆధారంగా ఈ థియేటర్ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు టీజర్ హింట్ ఇస్తోంది.
ఈ సినిమాలో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా, ‘జై భీమ్’ ఫేమ్ అదితి బాలన్ మరో ముఖ్య పాత్ర పోషిస్తోంది. వైశాఖ్ జె ఫిల్మ్స్ బ్యానర్‌పై డాక్టర్ వైశాఖ్ జె గౌడ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతాన్ని అందిస్తుండగా, టీజర్లో వినిపించిన రెట్రో డిస్కో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన విజువల్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ఈ కన్నడ-తెలుగు ద్విభాషా చిత్రం వినూత్నమైన కాన్సెప్ట్‌తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతోంది. శివన్న, హేమంత్ రావు కాంబినేషన్లో వస్తున్న ఈ మైండ్ బ్లోయింగ్ స్పై యూనివర్స్ కోసం సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.