హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ప్రఖ్యాత శిల్పి, చిత్రకారుడు డాక్టర్ హోతి బస్వరాజ్ మూడు దశాబ్దాల కళా ప్రస్థానాన్ని తెలిపే అరుదైన ఛాయాచిత్రాలతో ప్రముఖ చరిత్రకారులు, మ్యూజియం క్యూరేటర్ డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ రచించిన ‘బసవరాజీవం’ గ్రంథాన్ని జహీరాబాద్ ఎంపీ షెటార్ సురేశ్‌కుమార్ ఆవిష్కరించారు. హైదరాబాద్ స్టేట్ గ్యాలరీలో వారంరోజులుగా కొనసాగుతున్న ‘బసవ’ ఏకవ్యక్తి కళా ప్రదర్శన గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆ గ్రంథాన్ని ఎంపీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ శిల్పులు, బస్వరాజ్ గురువులు ఆచార్య ఎస్ఎం పీరన్, ఆచార్య జీవై గిరి, తెలంగాణ అమరజ్యోతి శిల్పి, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.