హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 15: హనుమకొండ న్యూబస్టాండ్ రోడ్‌లోని శ్రీబాలాంజనేయ స్వామి దేవాలయ ఆధ్వర్యంలో 55వ సంవత్సర గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీభక్తాంజనేయ స్వామి దేవాలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరి శ్రీబాలాంజనేయస్వామి వరకు వినాయక ప్రాణప్రతిష్ట పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కనుకుంట్ల రవికుమార్, ప్రధాన కార్యదర్శి మిరుకుల మనోహర్, కోశాధికారి బండారి మహేందర్, ఉపాధ్యక్షులు గంద కృష్ణ, అంబటి కుమార్‌స్వామి, మిద్దెల బాబు, సల్ల జనార్ధన్, తోట ప్రకాష్, ఆకుల దుర్గయ్య, గిరి రాజయ్య, కార్యదర్శిలు బొల్లం అశోక్, శెట్టి నరేందర్, గందె మధు, కర్రు మనోజ్‌కుమార్, మీరుకుల రేవంత్, విగ్రహ దాతలు జూలూరి సరిత-శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నాగిళ్ల శంకర్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమంలో నిర్వహించి తీర్థప్రసాద వినియోగం చేశారు.