పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండ : ఎమ్మెల్యే బాలు నాయక్
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీలో...
– దేవరకొండ నియోజకవర్గంలో రూ.2.14 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
దేవరకొండ, నవంబర్ 12 : పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీలో ఆయన పాల్గొని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొత్తం 209 మంది లబ్ధిదారులకు రూ.84 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, అలాగే 130 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.1.30 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తంగా 339 మంది లబ్ధిదారులకు సుమారు రూ.2.14 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు.
సూపర్ ఎల్‌నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి
రానున్న రోజుల్లో సూపర్ ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలపై రైతులు, ప్రజలు ముందస్తు అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, తక్కువ నీటితో సాగు చేసే పంటలు, ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైతే రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకునేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండ : ఎమ్మెల్యే బాలు నాయక్
2028 జూన్ నాటికి దేవరకొండ నియోజకవర్గం సస్యశ్యామలం
దేవరకొండ నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు అందించడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బాలు నాయక్ స్పష్టం చేశారు. 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టుల ద్వారా దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతానికి సాగునీరు అందించి, మిర్యాలగూడ లేదా నాగార్జునసాగర్ ప్రాంతాల్లో ఉన్నట్లుగా పచ్చని పంటలతో దేవరకొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో దేవరకొండ నియోజకవర్గ రైతుల కష్టాలు తొలగించి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, ఆలంపల్లి నరసింహ, హనుమంతు వెంకటేష్ గౌడ్, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ పట్టణ కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండ : ఎమ్మెల్యే బాలు నాయక్
Vithal Goud | కల్లు గీత కార్మికుల కుటుంబాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు ఆపాలి : రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Health Tips | అంజీరా పండ్లు తరచూ తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
Women Professors | శాంతియుత నిరసన చేస్తున్న ప్రొఫెసర్ల అరెస్ట్.. పోలీసుల దౌర్జన్యం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

