Talasani Srinivas Yadav | ఉద్యోగులకు భద్రత లేకుండా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలెక్ట్రిసిటీ బస్సుల పేరుతో ఆర్టీసీ ఉద్యోగుల ఉపాధిని ప్రభుత్వం దెబ్బ తీస్తున్నదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎలెక్ట్రిసిటీ బస్సులకు ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లు ఎందుకు.. ? ఆర్టీసీ ఉద్యోగులనే నియమించాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ డిపోలు, ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు ఎలా ధారాదత్తం చేస్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతరాహిత్యం వలనే ఆర్టీసీ సమ్మెతో పేదలు, విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు.. ఇప్పుడు మహిళలు పరిస్థితి ఏంటి..? సమస్యలు పరిష్కరించి సమ్మె విరమించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తలసాని హెచ్చరించారు.
Kailsas Bapu Kote | కుమార్తె కలుగాలన్న ఆశ నెరవేరకపోవడంతో ఆ దంపతులు ఏం చేశారో తెలుసా..?
Telangana High Court | పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే!