‘మైనారిటీ సంక్షేమ దినోత్సవం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం’
మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ ప్రకటనలకే పరిమితమవుతోందని, మైనారిటీ సంక్షేమ దినోత్సవం పేర ఏటా మెమోలు జారీ చేయడం తప్ప క్షేత్రస్థాయిలో అధికారికంగా వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా అన్నారు.
– అధికారిక వేడుకలకు నోచుకోని మౌలానా ఆజాద్ జయంతి
– ప్రభుత్వానికి వినతులు చేసినా మారని తీరు
– మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకుబ్ పాషా ఆగ్రహం
– రేపు మైనారిటీ సంక్షేమ దినోత్సవం
రుద్రంపూర్, నవంబర్ 10 : మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ ప్రకటనలకే పరిమితమవుతోందని, మైనారిటీ సంక్షేమ దినోత్సవం పేర ఏటా మెమోలు జారీ చేయడం తప్ప క్షేత్రస్థాయిలో అధికారికంగా వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా అన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 11న మైనారిటీ సంక్షేమ దినోత్సవం నిర్వహించాలని సోమవారం రాష్ట్ర మైనారిటీ శాఖ కార్యదర్శి తాజాగా మెమో జారీ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఏటా మెమోలు జారీ చేస్తూ చేతులు దులుపుకోవడం కాకుండా, అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా వేడుకలు నిర్వహించేలా శాశ్వత ఉత్తర్వులు జారీ చేయాలని గత నెలలో ప్రభుత్వానికి లేఖలు రాయడంతో పాటు సీఎం ప్రజావాణిలోనూ వినతిపత్రం అందించినట్లు వెల్లడించారు. అయినప్పటికీ ప్రభుత్వ వైఖరిలో మార్పు కనిపించడం లేదని విమర్శించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేయగా, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఆ స్ఫూర్తిని కొనసాగించడం లేదని యాకుబ్ పాషా అసంతృప్తి వ్యక్తం చేశారు. మైనారిటీల పట్ల చిన్నచూపు వీడి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని అన్ని విధ్యా సంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అధికారికంగా నిర్వహించి ప్రభుత్వం తమ చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

