హనుమకొండ చౌరస్తా : తెలంగాణ ప్రాంత నిరుద్యోగుల కోసం 25 సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు ఆర్టీసీ ( RTC ) లో అద్దె బస్సుల స్కీం ( Rental Bus Scheme ) ను కొనసాగించారని, ఈ స్కీంను నిర్వీర్యం చేయవద్దని రాష్ట్ర అద్దె బస్సు ఓనర్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు లక్కం ప్రభాకర్ కోరారు. ఆదివారం అభిరామ్ గార్డెన్స్‌లో వరంగల్ రీజినల్ కౌన్సిల్ సమావేశం మారిపెల్లి రామిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథులుగా లక్కం ప్రభాకర్, రాష్ట్ర అధ్యక్షుడు అబ్బ మధుకర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.
దేశవ్యాప్తంగా ఆర్టీసీకి అనుసంధానంగా అద్దె వాహనాలు నడుస్తున్నాయని, కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే ఈవీ వాహనాలుగా మారిస్తే సరిపోదని, కాలుష్యనివారణకు ఇతర వాహనాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు.
2007,2009 రీ ప్లేస్మెంట్ బస్సులను ఇప్పించే విధంగా రాష్ట్ర కార్యవర్గం కృషి చేయాలని, వరంగల్ రీజినల్ల డీఎంలతో ప్రతి 3 నెలలకోసారి ఆర్ఎం కార్యాలయంలో జాయింట్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలవర్ధన్‌రెడ్డి, ఎన్.ప్రసాద్, హబీబ్, జే.వెంకట్‌రెడ్డి, కె.సదానందం, ఎండి.పర్వేజ్, జి.వెంకన్న, కె.భాస్కర్‌రెడ్డి, కుమార్, బి.రాజలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.