రామగిరి, జూన్ 14 : ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్స్‌కు అందించాల్సిన పెండింగ్ 5 డీఏలు, పీఆర్సీని తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్‌రెడ్డి, నల్లగొండ మండల యూనిట్ అధ్యక్షుడు గజవెల్లి సత్యం డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండలోని పెన్షనర్స్ భవనంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావస్తున్నా నేటికి అమలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.
రిటైర్డ్ ఉద్యోగికి అందాల్సిన బెనిఫిట్స్ సహితం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం శనివారం సామూహిక జన్మదినోత్సవంలో భాగంగా 40 మంది పెన్షనర్స్‌ను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందచేశారు. ఈ సమావేశంలో జిల్లా, మండలాల నాయకులు జెల్లా శ్రీశైలం, యాదా వాసుదేవ్, ఎన్.రంగయ్య, యుగేందర్, రఘునాథం, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
Nalgonda : ప్రభుత్వం తక్షణమే పెండింగ్ డీఏ, పీఆర్సీని విడుదల చేయాలి : వెంకట్‌రెడ్డి