హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): వర్షపు నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకుడుగుంతలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 14, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు వెచ్చించేందుకు వీలుకల్పిస్తూ మంగళవారం మార్గదర్శకాలను విడుదలచేసింది. పాఠశాలవారీగా స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ను రూపొందించి అమలుచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీలకు కేటాయించిన నిధులతో స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు.