అద్దాల అంగడీ మాయ..దాని సూపుకు నరుడి బతుకు బొంగరమైపాయెరా.. అంటూ ఆన్లైన్ షాపింగ్ మాయను ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అద్భుతంగా అక్షరీకరించారు. ఈ కవిత ఇటీవల తనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టిన వల్లంకితాళం కవితాసంపుటిలోనిది. ఈ పాటను వెంకన్న పాడుతుంటే ఆన్లైన్ షాపింగ్ మాయాజాలం మన కళ్లముందే కనిపిస్తుంది.. మరెందుకాలస్యం మీరూ ఆ పాట వినండి.