Prabhas| ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చాలా పెద్దగానే ఉంది. ఆయన నటించాల్సిన సినిమాలలో కల్కి 2 కూడా ఉంది. ‘కల్కి 2898 AD’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు నాగ్ అశ్విన్. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులలో ఆయన బిజీగా ఉండగా, ‘కల్కి 2898 AD’ చిత్రానికి సీక్వెల్ షూటింగ్ మే మధ్యలో ప్రారంభించనున్నట్టు ఓ టాక్ నడుస్తుంది. రీసెంట్గా అమితాబ్ బచ్చన్ కూడా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ పూర్తి చేసిన తర్వాత, కల్కి 2 షూటింగ్ లో పాల్గొంటానని తెలియజేశారు. అయితే ఈ క్రేజీ సీక్వెల్ షూటింగ్ మే నెలలో మొదలై జూన్ 15 వరకు ఒక షెడ్యూల్ జరుపుకోనుందని సమాచారం.
‘కల్కి 2898 ఏడీ’లో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకొణె.. పార్ట్ 2లోనూ కొన్ని సన్నివేశాల్లో అమ్మగా కనిపించి అలరించనుంది. ఇక ఆ మధ్య చిత్ర నిర్మాతలు స్వప్న- ప్రియాంక మాట్లాడుతూ.. ‘కల్కి 2898 ఏడీ’తో పాటే సీక్వెల్‌కు సంబంధించిన కొంత షూట్‌ని పూర్తి చేశాం. పార్ట్2కి సంబంధించి 35 శాతం షూటింగ్ జరిగింది అని అన్నారు. అంటే మిగతా పార్ట్ ఈ ఏడాది పూర్తి చేసే అవకాశం ఉంది. కాగా కల్కి సినిమాలో సుమతి (దీపికా పదుకొనే) ని అపహరిస్తారు. దీంతో ఆమెను కాపాడటానికి అశ్వత్థామ భైరవ/కర్ణ (ప్రభాస్) బరిలోకి దిగుతారు. ఇప్పుడీ సీక్వెన్స్ ఎలా ఉంటుందో అని అందరిలో అనేక ఆలోచనలు వస్తున్నాయి.
కమాండర్ యాస్కిన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ సెకండ్ పార్ట్‌లో ప్రేక్షకులకి మరింత ఎంటర్టైన్ అందించడం ఖాయం అంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ‘అశ్వత్థామ’ పాత్రను పోషించగా, సీక్వెల్ లోనూ ఆయన పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన కల్కి సినిమాలో దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, శోభన, బ్రహ్మానందం, పశుపతి, అన్నా బెన్, కావ్యా రామ చంద్రన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.