ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలోనే మరో 10 రాఫెల్స్
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు త్వరలోనే కనీసం మరో 10 రాఫెల్ ఫైటర్ జెట్స్ రానున్నాయి.

న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు త్వరలోనే కనీసం మరో 10 రాఫెల్ ఫైటర్ జెట్స్ రానున్నాయి. ఇప్పటికే అంబాలాలోని 17 స్క్వాడ్రన్‌లో 11 రాఫెల్స్ ఉండగా.. ఈ తాజా రాఫెల్స్తో వీటి సంఖ్య 21కి చేరనుంది. రానున్న రెండు, మూడు రోజుల్లోనే ఫ్రాన్స్ నుంచి నేరుగా 3 రాఫెల్ ఫైటర్స్ ఇండియాకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీటికి గగనతలంలోనే తిరిగి ఇంధనం నింపుకునే సామర్థ్యం ఉన్నదని తెలిపాయి. ఇక వచ్చే నెలలో మరో 7 నుంచి 8 రాఫెల్స్ వస్తుండటంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరింత బలోపేతం కానున్నట్లు ఆ వర్గాలు చెప్పాయి.
గతేడాది జులై-ఆగస్ట్ నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి రాఫెల్స్ రావడం ప్రారంభించాయి. చైనాతో ఘర్షణ వాతావరణం సందర్భంగా ఈ రాఫెల్స్‌ను తూర్పు లఢాక్ ప్రాంతంలో పెట్రోలింగ్ కోసం ఉంచారు. తాజాగా రానున్న రాఫెల్ విమానాలు కూడా మొదట అంబాలాలోనే ఉండనున్నాయి. 2016లో ఫ్రాన్స్ నుంచి మొత్తం 36 రాఫెల్ జెట్స్ కోసం ఇండియా ఆర్డర్ చేసింది.
ఇవికూడా చదవండి..
100 కోట్లు ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన భారత్ బయోటెక్, సీరమ్
సుయెజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్‌గివెన్ షిప్ కాస్త కదిలింది
ప్రపంచంలో సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్.. ప్రిన్స్ విలియమ్
నాపై రిటైర్డ్ జడ్జి విచారణ జరుపుతారు: అనిల్ దేశ్‌ముఖ్
ఆండ్రాయిడ్ యూజర్లూ.. సిస్టమ్ అప్డేట్తో జాగ్రత్త
కోహ్లి అడిగాడు.. సాఫ్ట్ సిగ్నల్‌కు నో చెప్పిన బీసీసీఐ
బెంగాల్‌లోని ఆ 30 సీట్లలో 26 బీజేపీవే: అమిత్ షా
కూటమి కొట్లాట.. అనిల్ ఓ యాక్సిడెంటల్ హోమ్ మినిస్టర్ అన్న శివసేన
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

