ఆసిఫాబాద్ టౌన్ : జిల్లా కేంద్రంలోని పీటీజీ గిరిజన గురుకులంలో గురువారం తొలి రోజు విద్యాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో నూతనంగా చేరిన చిన్నారులకు ప్రిన్సిపాల్ భద్రయ్య ( Prinicpal Badraiah ) సిబ్బందితో కలిసి స్వాగతం పలుకుతూ చిన్నారులచే అక్షరాలు దిద్దించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆదివాసీ విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పడం నిజంగా ఒక అదృష్టం అని అన్నారు.
చిన్నారులు కొత్తగా పాఠశాలకు వచ్చిన నేపథ్యంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం చిన్నారులకు చాక్లెట్స్, నోట్ బుక్స్, ట్రంక్ బాక్స్‌లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సుజాత, ఓంకార్ కృష్ణ, ఉపాధ్యాయులు సత్యనారాయణ, తిరోజ, విజయ, తిరుపతి, రాము, మాన్కు, సాయినాథ్, సచిన్, జుగాధి రావు తదితరులు పాల్గొన్నారు.