న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28 : బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోవడం, డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో పెట్టుబడిదారులు బంగారం అమ్మకాలకు మొగ్గుచూపడంతో వీటి ధరలు భారీగా పడిపోయాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.2,600 తగ్గి రూ.1.50 లక్షలకు పడిపోయింది.
కిలో వెండి ఏకంగా రూ.5 వేలు తగ్గి రూ.2.32 లక్షలకు దిగొచ్చింది. గత శుక్రవారం ముగింపు ధర రూ.2.37 లక్షలుగా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 128.93 డాలర్లు లేదా 3 శాతం తగ్గి 4,156.44 డాలర్లకు పడిపోగా, వెండి 2.96 డాలర్లు తగ్గి 61.34 డాలర్లకు దిగొచ్చాయి.