న్యూఢిల్లీ, జనవరి 23: బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ దూసుకుపోయాయి. స్టాకిస్టులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు పుత్తడి ధర మళ్లీ ఊపందుకున్నది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ. 1,500 ఎగబాకి రూ.1,57, 200కి చేరుకున్నది. బుధవారం రికార్డు స్థాయి రూ.1,59,700కి చేరుకున్న విషయం తెలిసిందే. పసిడితోపాటు వెండి ధరలు తిరిగి పుంజుకున్నాయి. కిలో వెండి ఏకంగా రూ. 9,500 ఎగబాకి రూ.3,29,500 పలికింది. అంతకుముందు ఇది రూ.3.20 లక్షలుగా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,900 డాలర్లను అధిగమించగా, వెండి 3 శాతం ఎగబాకి 99.46 డాలర్లకు చేరుకున్నది.