Gold price | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!
Gold price | బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని సెషన్లుగా కొనసాగుతున్న స్వల్ప దిద్దుబాటు ట్రెండ్ మంగళవారం కూడా కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు పెద్దగా ఒడుదొడుకులకు లోనుకాకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
Gold price : బంగారం, వెండి ధరలు (Gold, Silver prices) స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని సెషన్లుగా కొనసాగుతున్న స్వల్ప దిద్దుబాటు ట్రెండ్ మంగళవారం కూడా కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు పెద్దగా ఒడుదొడుకులకు లోనుకాకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక మార్కెట్ (Stock Market) వర్గాల సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌లో బుధవారం ఉదయం 10 గ్రాముల స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం రూ.1,56,210ల వద్ద, 22 క్యారెట్ల బంగారం రూ.1,43,190ల వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,160గా ఉంది. మంగళవారం నాటి ముగింపు ధరలతో పోలిస్తే.. సుమారు పది రూపాయల మేర తగ్గింది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అమరావతిలో రూ.1,56,210లు, విజయవాడలో రూ.1,56,210లు, విశాఖపట్నంలో రూ.1,56,210, రాజమండ్రిలో రూ.1,56,210 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో కదలికలు, అమెరికా డాలర్ విలువ, భౌగోళిక రాజకీయ పరిణామాలు, దేశీయ డిమాండ్ వంటి అంశాలు భారత మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.
అంతర్జాతీయంగా కమొడిటీ మార్కెట్లపై ఒత్తిడి తగ్గడంతో ధరలు కాస్త మెత్తబడ్డాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్తగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగితే ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పండుగల సీజన్ ఏమీ లేకపోవడంతో కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని నగరంలోని జ్యుయెలరీ వ్యాపారులు తెలిపారు. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా స్థిరంగా ఉంటూ స్వల్పంగా తగ్గాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

