భాగ్యలక్ష్మికి బంగారు పతకం
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో దొంతు భాగ్యలక్ష్మి బంగారు పతకంతో మెరిసింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా శనివారం జరిగిన మహిళల 800మీ రేసును నాగర్‌కర్నూల్‌కు చెందిన భాగ్యలక్ష్మి 2:13:9 సెకన్ల టైమింగ్‌తో పూర్తి చేసి పసిడి పతకం దక్కించుకుంది. విజయలక్ష్మి, అయేషా వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఇదిలా ఉంటే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఏడు పతకాలు ఖాతాలో వేసుకున్నారు. వీరిలో భాగ్యలక్ష్మి సహా మల్లిక( స్వర్ణం), సత్య(స్వర్ణం), నవ్య(రజతం), కీర్తన(రజతం), ప్రవలిక( కాంస్యం), కావ్య(కాంస్యం) ఆకట్టుకున్నారు. సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, కోచ్ రమేశ్ విజేతలకు పతకాలు అందజేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

