కొజికోడ్: జాతీ య ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటి క్స్ టోర్నీలో భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ స్వర్ణం కైవసం చేసుకోగా.. తెలుగమ్మాయి దండి జ్యోతిక శ్రీ కాంస్యంతో సత్తా చాటింది. ఆదివారం మహిళల 100 మీటర్ల ఫైనల్లో ద్యుతీ 11.49 సెకండ్లలో గమ్యాన్ని చేరగా.. జిల్నా (11.63 సె; కేరళ), సిమి (11.71; కర్ణాటక) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. మహిళల 400 మీటర్ల పరుగులో జ్యోతిక 53.90 సెకండ్లలో లక్ష్యం పూర్తి చేసి కాంస్యం కొల్లగొట్టింది.