Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Punjagutta Temple: ఇవాళ మూలానక్షత్రం. పంజాగుట్టలోని దుర్గాభవానీ అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో తీర్చిదిద్దారు. ఆలయంలో దేవీనవరాత్రులను వైభవంగా నిర్వహిస్తున్నారు. వందలాది సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
హైదరాబాద్: దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రుల పర్వదినాలు వైభవంగా జరుగుతున్నాయి. మూలానక్షత్రం నేపథ్యంలో పలు ఆలయాల్లో ఇవాళ అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారములో దర్శనం ఇస్తున్నారు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఉన్న శ్రీ దుర్గాభవానీ ఆలయంలో .. అమ్మవారు ఇవాళ సరస్వతీ దేవిగా దర్శనం ఇస్తున్నారు. ఆరవ రోజు అత్యంత సుందరంగా అమ్మవారిని అలంకరించారు. ధవళ వస్త్రాల్లో అమ్మవారు .. చదువుల తల్లిగా భక్తులను ఆశీర్వదిస్తున్నారు. చిన్న పిల్లలకు ఇవాళ ఆలయంలో సరస్వతీ పూజ నిర్వహిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆలయంలో అన్నవితరణ కార్యక్రమం కూడా ఉన్నది. ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, నవీన్ ఆధ్వర్యంలో పూజలు జరుగుతున్నాయి. భక్తుల కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.
శరన్నవరాత్రుల్లో శ్రీ సరస్వతీ దేవి అలంకారానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. దేవీ నవరాత్రుల్లో ఆరో రోజున లేదా మూలా నక్షత్రం ఉన్న రోజున అమ్మవారిని చదువుల తల్లి సరస్వతీ దేవిగా అలంకరించి పూజిస్తారు. సరస్వతి దేవి జ్ఞానం, విద్య, సాహిత్యం, కళలు, సంగీతం, వివేకానికి అధిదేవత. అమ్మవారిని ఈ రూపంలో దర్శించుకుని ఆరాధిస్తే బుద్ధి వికాసం, వాగ్వైభవము, విద్యా లాభం కలుగుతాయి.

ఇక విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గా దేవి కూడా ఇవాళ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనం ఇస్తున్నారు. అర్ధరాత్రి 12.49గం.కు దుర్గమ్మ దర్శనం ప్రారంభమైంది. ఇవాళ అన్ని రకాల వీవీఐపీ, సిఫార్సు దర్శనాలు రద్దు చేశారు. ఉచితంగానే అన్ని క్యూలైన్ల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

