Sankranthiki Vasthunam | విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కథానాయకుడిగా వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా.. రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మెలోడి సాంగ్ ‘గోదారిగట్టు మీద రామచిలకవే’ పాట ఫుల్ వీడియో(Godari Gattu Video Song)ను విడుదల చేశారు. థియేటర్లో ఒక ఊపు ఊపిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో విడుదల కావడంతో వ్యూస్‌తో దూసుకుపోతుంది. రమణ గోగుల, మధుప్రియ పాడిన ఈ పాటకు భీమ్స్ సంగీతం అందించాడు.