హైదరాబాద్ : సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు TRS ఖతర్ ఆధ్వర్యంలో దోహాలో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా TRS ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని కేకు కట్ చేసి జననేతకు శుభాకాంక్షలు తెలిపారు.
నిండు నూరేళ్లు సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతున్ని వేడుకున్నట్టు తెలిపారు.
ఈ వేడుకల్లో TRS ఖతర్ కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు ఎల్లయ్య తాళ్ల పెళ్లి, శేఖర్ చిలువేరి, శశాంక్ అల్లకొండ, రాజేష్, శ్రీనివాస్, గడ్డి రాజు, రాజేష్ నేత, రాజి రెడ్డి మాసం, శంకరచారి బొప్పరపు, రాజు కుందూరు , ప్రవీణ్ మోతే, శేఖర్ అల్లకొండ, మీరా నర్సయ్య, టిక్ టాక్ రాజు, బత్తిని భాస్కరగౌడ్, తోపారపు నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.