Phone To Kids | చిన్నారులు భావోద్వేగాలకు గురైనప్పుడు వెంటనే ఫోన్ ఇస్తున్నారా.. ఇకపై అలా చేయకండి.. ఎందుకంటే..?
చిన్నారులు ఏడ్చినప్పుడు లేదా కోపంగా, అసహనంగా ఉన్నప్పుడు వారిని శాంతింపజేయడానికి చాలామంది తల్లిదండ్రులు వెంటనే సెల్‌ఫోన్ లేదా ఇతర తెరలు ఉన్న పరికరాలను చేతిలో పెడుతున్నారు. ఇది తాత్కాలికంగా మంచి పరిష్కారంలా కనిపించినప్పటికీ, పిల్లల మెదడు అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Phone To Kids | చిన్నారులు ఏడ్చినప్పుడు లేదా కోపంగా, అసహనంగా ఉన్నప్పుడు వారిని శాంతింపజేయడానికి చాలామంది తల్లిదండ్రులు వెంటనే సెల్‌ఫోన్ లేదా ఇతర తెరలు ఉన్న పరికరాలను చేతిలో పెడుతున్నారు. ఇది తాత్కాలికంగా మంచి పరిష్కారంలా కనిపించినప్పటికీ, పిల్లల మెదడు అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకుని వాటిని నియంత్రించుకోవడం నేర్పించకుండా, ఫోన్ ద్వారా తాత్కాలికంగా శాంతింపజేసే ఈ విధానాన్నే డిజిటల్ పసిఫైయర్ గా పిలుస్తున్నారు. అంటే పిల్లలు తమ భావాలను తామే అధిగమించడం నేర్చుకునే బదులు, బయట నుంచి లభించే డిజిటల్ ఉద్దీపనపై ఆధారపడడం అన్నమాట.
భావోద్వేగం కలిగిన వెంటనే ఫోన్ ఇస్తే..
చిన్నారులకు కోపం, బాధ, నిరాశ, అసహనం వంటి భావాలను స్వయంగా నియంత్రించుకునే సామర్థ్యం పుట్టుకతోనే ఉండదు. పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రుల సహకారంతో వారు ఈ నైపుణ్యాన్ని నేర్చుకుంటారు. పిల్లలు ఏడ్చినప్పుడు వారి దగ్గరకు వెళ్లి ఓదార్చడం, ఎందుకు బాధపడుతున్నారో అర్థమయ్యేలా చెప్పడం ద్వారా భావోద్వేగాలను ఎదుర్కొనేందుకు అవసరమైన మెదడు నాడీ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. కానీ అసహనం కలిగిన వెంటనే ఫోన్ ఇవ్వడం వల్ల ఈ నేర్చుకునే అవకాశం వారికి దక్కదు. తెరపై కనిపించే రంగులు, వేగంగా మారే దృశ్యాలు, తక్షణ వినోదం పిల్లల దృష్టిని ఆకర్షిస్తాయి. దీంతో అసలు భావోద్వేగాన్ని అర్థం చేసుకుని అధిగమించే బదులు, దాని నుంచి దృష్టి మళ్లుతుంది. ఫలితంగా చిన్న చిన్న విషయాలకే అతిగా స్పందించడం, ఆటలో ఓడిపోయినా, ఎవరి కోసమైనా వేచి ఉండాల్సి వచ్చినా లేదా వద్దు అని చెప్పినా తట్టుకోలేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
తల్లిదండ్రులు ఏం చేయాలి..?
పిల్లలు బాధలో ఉన్నప్పుడు కౌగిలించుకోవడం, వారితో మాట్లాడడం, ఓదార్పు మాటలు చెప్పడం వంటి చర్యలు వారి భావోద్వేగ అవగాహనకు ఎంతో ఉపయోగపడతాయి. ఇలాంటి అనుభవాలు లేకపోతే తమ భావాలను గుర్తించడం, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, వాటిని మాటల్లో వ్యక్తపరచడం కష్టమవుతుంది. భవిష్యత్తులో సమస్యలు ఎదురైనప్పుడు తెరల ద్వారా వాటి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించే అలవాటు ఏర్పడుతుంది. ఇది ఆందోళన వంటి మానసిక సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, పిల్లలు అసహనంగా ఉన్నప్పుడు ఫోన్ ఇవ్వడం వల్ల శారీరక చురుకుదనం కూడా తగ్గుతుంది. పరుగెత్తడం, దూకడం, ఆడుకోవడం వంటి కార్యకలాపాలు శరీరంలోని ఒత్తిడి హార్మోన్ల ప్రభావాన్ని తగ్గించి నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉండేందుకు సహాయపడతాయి. ఇవి లేకపోతే నిద్ర నాణ్యత తగ్గడం, జీర్ణ సమస్యలు, కండరాల బలహీనత, శరీర సమన్వయం లోపించడం, అధిక బరువు వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఫోన్లను పూర్తిగా తొలగించాలా..?
అందుకని పిల్లల జీవితంలో ఫోన్లు, ట్యాబ్లెట్లను పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేదు. అయితే వారు ఏడ్చినప్పుడు లేదా కోపంగా ఉన్నప్పుడు శాంతింపజేసేందుకు వాటిని ఉపయోగించకూడదు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు ప్రశాంతంగా స్పందించి, ప్రేమగా మాట్లాడాలి. నీళ్లు ఇవ్వడం, కొంతసేపు విశ్రాంతి తీసుకునేలా చేయడం, నెమ్మదిగా శ్వాస తీసుకోవడం నేర్పించడం వంటి మార్గాలను అనుసరించాలి. పిల్లలు కోపంగా ఉండడం లేదా బాధపడడం సహజమని, ఆ భావాలు కొంతసేపటికి తగ్గిపోతాయని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఫోన్ అలవాటు ఉన్న పిల్లలకు ఈ మార్పు మొదట్లో కష్టంగా ఉంటుంది. ఫోన్ ఇవ్వకపోతే వారు మరింతగా ఏడ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ తల్లిదండ్రులు సహనంతో వారి పక్కనే ఉండి, సమస్యలను ఎలా ఎదుర్కోవాలో నేర్పించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు క్రమంగా తమ భావోద్వేగాలను తామే నియంత్రించుకోవడం నేర్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nepal Earthquake | నేపాల్‌లో 5.3 తీవ్రతతో భూకంపం.. భారత్ సహా పలు దేశాల్లో ప్రకంపనలు
Phone To Kids | చిన్నారులు భావోద్వేగాలకు గురైనప్పుడు వెంటనే ఫోన్ ఇస్తున్నారా.. ఇకపై అలా చేయకండి.. ఎందుకంటే..?
Murthy | టాలీవుడ్ జర్నలిస్ట్‌పై TFJA సంచలన నిర్ణయం.. ఇకపై ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్లకు నో పర్మీషన్!
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డికి మద్దతుగా కోదాడలో ప్రచారం
Aadarsha Kutumbam | ఓటీటీలోకి వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి అంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

