Nepal Earthquake | నేపాల్‌లో 5.3 తీవ్రతతో భూకంపం.. భారత్ సహా పలు దేశాల్లో ప్రకంపనలు
Nepal Earthquake | నేపాల్‌లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైంది. ఈ భూకంపం ప్రకంపనలు భారత్‌తో పాటు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనాలోని పలు ప్రాంతాల్లోనూ కనిపించాయి.
Nepal Earthquake | నేపాల్‌లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైంది. ఈ భూకంపం ప్రకంపనలు భారత్‌తో పాటు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనాలోని పలు ప్రాంతాల్లోనూ కనిపించాయి. ఉదయం సుమారు 7:02 గంటలకు భూమి కంపించినట్లు ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి.
అమెరికా భూగర్భ పరిశోధన సంస్థ (USGS) ప్రాథమిక సమాచారం ప్రకారం.. నేపాల్‌లోని కోశి ప్రావిన్స్ లెలెప్ సమీపంలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 27.855 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 87.909 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద 20 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించినట్లు భారత జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం (NCS) వెల్లడించింది. అయితే నేపాల్ నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ భూకంప తీవ్రత 5.6గా పేర్కొంది. టప్లేజంగ్ జిల్లాలోని ఓలాంగ్చుంగ్ గోలా సమీపంలో, నేపాల్–టిబెట్ సరిహద్దుకు దగ్గరగా భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది.
భూకంప ప్రభావం బిహార్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌తో పాటు తూర్పు, ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో కనిపించింది. హిమాలయ ప్రాంతానికి సమీపంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలతో ఎత్తైన భవనాలు, ఇళ్లు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు కంపించినట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తమైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి వీధుల్లోకి చేరుకున్నారు. ఉదయం వాకింగ్, వ్యాయామం కోసం బయటకు వచ్చినవారు సైతం ఒక్కసారిగా భూమి కంపించడంతో ఆందోళనకు గురయ్యారు. ఉత్తర బెంగాల్‌లోని జల్పైగురి, అలీపుర్ద్వార్, కూచ్‌బెహార్ తదితర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు నమోదైనట్లు సమాచారం.
అసోంలో మరో భూకంపం
ఇదిలా ఉండగా, మంగళవారం తెల్లవారుజామున అసోంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో మరో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 2.5 తీవ్రత నమోదైంది. తెల్లవారుజామున 3:39 గంటలకు 15 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లు జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం 25.743 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 93.355 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉన్నట్లు గుర్తించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- bangladesh
- Bhutan
- china
- Earthquake
RELATED ARTICLES
తాజా వార్తలు
Nepal Earthquake | నేపాల్‌లో 5.3 తీవ్రతతో భూకంపం.. భారత్ సహా పలు దేశాల్లో ప్రకంపనలు
Phone To Kids | చిన్నారులు భావోద్వేగాలకు గురైనప్పుడు వెంటనే ఫోన్ ఇస్తున్నారా.. ఇకపై అలా చేయకండి.. ఎందుకంటే..?
Murthy | టాలీవుడ్ జర్నలిస్ట్‌పై TFJA సంచలన నిర్ణయం.. ఇకపై ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్లకు నో పర్మీషన్!
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డికి మద్దతుగా కోదాడలో ప్రచారం
Aadarsha Kutumbam | ఓటీటీలోకి వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి అంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

